English | Telugu

ప్రభాస్ రెబెల్ ఏప్రెల్ నెలాఖరు నుంచి

ప్రభాస్ "రెబెల్" సినిమా ఏప్రెల్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షుటింగ్ జరుపుకోనుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మిల్కీ వైట్‍ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.పుల్లారావు, జె.భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం " రెబెల్ ". ప్రభాస్ "రెబెల్" చిత్రం నిజానికి లాంఛనంగా ప్రారంభమై చాలా రోజులైంది. కానీ మధ్యలో ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించటానికి కొంత జాప్యం జరిగింది.

ఈ చిత్రం ఏప్రెల్ నెలాఖరుకల్లా రెగ్యులర్ షూటింగ్‍ ప్రారంభించుకుంటూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ప్రభాస్ "రెబెల్" చిత్రంలో అందాల యోగా టీచర్ అనుష్క, పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. "రెబెల్" ప్రభాస్ చిత్రాలన్నింటిలోకీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని తెలిసింది. ప్రభాస్ "రెబెల్" సినిమాకి యమన్ సాయి సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ "రెబెల్" సినిమాలో హీరో ప్రభాస్ పాత్ర అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రని తెలిసింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.