English | Telugu

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

-జన నాయగాన్ ని చూసి ఎవరు భయపడుతుంది!
-ఎందుకు భయం
-అసలు సినిమా ఏం ఇచ్చింది! ఏం చేసింది
-విజయ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే నటుడ్ని అయితే సూపర్ హీరోగా చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.

సినిమా ఇచ్చిన శక్తి ద్వారానే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి 'తమిళగ వెట్రి కజగం'(TVK)అనే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ సినిమాలకి ఉండే జాతర ఈ సారి జన నాయగాన్ ద్వారా మరింతగా ఎక్కువగా అయ్యింది. ఇందుకు ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అదిరోహించి ప్రజలకి సేవ చేయడం కోసం జన నాయగాన్ తన ఆఖరి మూవీ అని విజయ్ ప్రకటించడం. ట్రైలర్ ద్వారా రాజకీయ అంశాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ట్రైలర్ చివరలో విజయ్ కొంత మంది రాజకీయ నాయకులని కొడుతు ప్రజలకి మంచి చెయ్యడానికి రాజకీయాల్లో ఉండమంటే దోపిడీలు, హత్యలు చేస్తారా అంటాడు. దీంతో కొంత మంది డిఎంకే నేతలు తమిళనాడులోని కొన్ని ఏరియాల్లో ఉన్న థియేటర్స్ కి జన నాయగాన్ ప్రదర్శించడానికి వీల్లేదని బెదిరిస్తున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Also read: రాజా సాబ్ బ్రేక్ ఎవెన్యూ అవ్వాలంటే రావాల్సింది ఇదేనా! ఫ్యాన్స్ ఏమంటున్నారు

దీంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు స్పందిస్తు జన నాయగన్ ద్వారా విజయ్ ప్రభంజనంలో డిఎంకే ఎక్కడ కొట్టుకుపోతుందో అని ఆ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు భయపడుతున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. మూవీ లవర్స్, సినీ విశ్లేషకులు కూడా స్పందిస్తు జన నాయగన్ తో విజయ్ మరోసారి సినిమాకి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పాడని అంటున్నారు

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.