English | Telugu

సినీ రచయిత గంధం నాగరాజు మృతి

సినీ రచయిత గంధం నాగరాజు మృతి. వివరాల్లోకి వెళితే రంగస్థలం నుండి నటుడిగా, రచయితగా ఎదిగిన గంధం నాగరాజు అల్లరి నరేష్, శర్వానంద్, కమలినీ ముఖర్జీ, రావు రమేష్ రావు ముఖ్య తారాగణంగా నటించగా, క్రిష్ తొలిసారి (జాగర్లమూడి రాధా కృష్ణ) దర్శకత్వం వహించిన "గమ్యం" చిత్రం ద్వారా సంభాషణా రచయితగా తెలుగు సినీపరిశ్రమలోకి ప్రవేశించిన సినీ రచయిత గంధం నాగరాజు. గంధం నాగరాజు ఆ తర్వాత "బాణం, సొంతఊరు, గాయం-2, బెట్టింగ్ బంగార్రాజు" వంటి అనేక చిత్రాలకు మాటల రచయితగా పనిచేసి చక్కని వర్థమాన మాటల రచయితగా మంచి పేరు గడించాడు. "గమ్యం" చిత్రం తర్వాత అతనికి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి.

కానీ ఉన్నట్టుండి మద్యపానలోలుడవటం వలన ఆ అవకాశాలు అతన్ని వీడిపోయాయి. ఈ మధ్య అతని ఆరోగ్యం చెడటంతో ఇటీవల గంధం నాగరాజుని హైదరాబాద్ గ్యాస్టోఎంట్రాలజీ హాస్పిటల్లో చేర్పించారు. ఏప్రెల్ 27 తేదీన ఈ వర్థమాన రచయిత గంధం నాగరాజు మద్యం పిశాచి బారినపడి మృతిచెందటం జరిగింది. మద్యపానానికి బానిసైన ఏ వ్యక్తికైనా గంధం నాగరాజు జీవితం ఒక చక్కని గుణపాఠంగా మిగులుతుంది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతనికి ఆత్మశాంతి కలగాలని తెలుగువన్ ఆశిస్తూంది. క్రింద గంధం నాగరాజుతో తెలుగు వన్ జరిపిన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్ వ్యూ తెలుగు వన్ ప్రేక్షకుల కోసం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.