English | Telugu
మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్.. ఏ ఫంక్షన్ దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు
Updated : Jan 7, 2026
-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెస్పాన్స్ వైరల్
-అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు
-ఎక్కడ జరుగుతున్నాయి
ప్రెజంట్ హైదరాబాద్(Hyderabad)నగరంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ అభిమానుల సందడి వాతావరణం నెలకొని ఉంది. ఒక వైపు మెగా, విక్టరీ ల మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదాపూర్ లో ఉన్న శిల్ప కళా వేదిక లో జరుగుతుండగా, రాజా సాబ్ ప్రీ రిలీజ్ పార్టీ అజీజ్ నగర్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. ఇక ఈ రెండు ఈవెంట్స్ గురించి సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ జరుగుతుంది.
also read: సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట!
వాళ్ళు మాట్లాడుతూ ఎవరి ఈవెంట్ దగ్గర ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని అంటున్నారు. దీంతో మరికొంత మంది అభిమానులు స్పందిస్తూ రెండు ఈవెంట్స్ దగ్గర ఫ్యాన్స్ భారీ ఎత్తున ఉన్నారని చెప్తున్నారు. అదే విధంగా రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.