English | Telugu
రామ్ చరణ్‌ని కాపాడిన సెల్ఫీ!
Updated : Feb 28, 2023
రీమేకులనేవి ఎంతోకాలంగా కొనసాగుతున్నాయి. ఒక భాషలో వచ్చి హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసే సంస్కృతి సినిమా మొదలైన నాళ్ల నుంచి ఉంది. అది ఇప్పుడు వచ్చింది కాదు. సినిమాలు మొదలైన మొదట్లోనే ఇలా రీమేక్ చిత్రాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మన దగ్గర బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేసుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ చాలా వరకు రీమిక్స్ సినిమాలో నటిస్తారు.
ఇక మన సినిమాలను అత్యధికంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తారు. పవన్ చిరులు ఈమధ్య తమిళ మలయాళ రీమేకులు చేస్తున్నారు. పవన్ తెలుగులో మలయాళ అయ్యపుమ్ కోషియమ్ చిత్రాన్ని భీమ్లా నాయక్ గా చేసి సూపర్ హిట్ కొట్టారు. బాలీవుడ్ పింక్ మూవీ ని వకీల్ సాబ్ గా తీశారు. ప్రస్తుతం తమిళ తేరి చిత్రాన్ని తెలుగులో హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌గా తీస్తున్నారు.తమిళంలో హిట్ అయిన వినోదాయ సిత్తం రీమేక్‌లో సాయిధరమ్ తేజ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా కీలకపాత్రలో పోషిస్తున్నారు.
ఇక చిరంజీవి విషయానికి వస్తే మలయాళ లూసిఫర్ ని గాడ్ ఫాదర్ అని రీమేక్ చేశారు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు, నేడు ఓటిటిల ప్రభావం పెరిగింది, అనువాద సినిమాలను ఓటీటీలో ప్రసారం అవుతున్నాయి. వాటిని రీమేక్ చేస్తే జనాలు పట్టించుకోవడం లేదు. తాజాగా మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ బాలీవుడ్ లో రీమేక్ గా విడుదల అయింది. ఈ సినిమా టైటిల్ సెల్ఫీ. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అత్యంత దారుణమైన ఓపెనింగ్ దక్కించుకుంది.
బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రామ్ చరణ్ కు కూడా షాక్ ఇచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ ను తెలుగులో రీమేక్ చేసే హక్కులను రాంచరణ్ ఎప్పుడో సొంతం చేసుకున్నాడు. రవితేజ వరుణ్ తేజ్ లతో చేయాలనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ బిజీలో ఉండటం వలన దాని ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇది భారీ డిజాస్టర్ కావడంతో తెలుగులో రీమేక్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.