English | Telugu

పాయల్ 'మంగళవారం' పోస్టర్ అదిరింది!

'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి. రెండో సినిమా 'మహాసముద్రం'తో నిరాశపరిచిన ఆయన.. మూడో సినిమాతో హిట్ కొట్టి లెక్క సరిచేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి 'మంగళవారం' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు.

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, 'A' క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతగా అజయ్ భూపతి తొలి చిత్రమిది.ఈ చిత్రంలో 'ఆర్ఎక్స్ 100'తో హీరోయిన్ గా పరిచయమై హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోందని సమాచారం. తాజాగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ విభిన్నంగా ఆకట్టుకునేలా ఉంది. కథానాయిక సీతాకోకచిలుకలా ఉండటం, ఆ సీతాకోకచిలుక రెక్కల్లో నెత్తుటి ధారతో ఉన్న కళ్ళు ఉండటం ఆసక్తిని రేకిత్తిస్తోంది. పోస్టర్ ని చూస్తేనే ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. మరి ఈ చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

కాన్సెప్ట్ పోస్టర్ విడుదలసందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ''కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూప్రయత్నించనటువంటికొత్త జానర్ సినిమా. 'మంగళవారం' టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతిదీ ఇంపార్టెంట్ క్యారెక్టరే'' అని అన్నారు.

నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మమాట్లాడుతూ ''ఆర్ఎక్స్ 100తోఅజయ్ భూపతి ఆడియన్స్‌ను ఎలాసర్‌ప్రైజ్ చేశారో, ఈ సినిమాతోనూ అదే విధంగాసర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ & కంటెంట్ అంతస్ట్రాంగ్‌గా ఉంటాయి. చిత్రీకరణ ఇటీవల ప్రారంభించాం. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని చెప్పారు.

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ సినిమాని మాత్రం పాన్ సౌత్ రేంజ్ లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం.