English | Telugu
ఆగస్ట్ 14 న తిరుపతికి వెళ్ళనున్న రజనీ కాంత్
Updated : Jul 25, 2011
ఆగస్ట్ 14 న తిరుపతికి వెళ్ళనున్న రజనీ కాంత్ అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, దీపిక పదుకునే, ఇలియానా హీరోయిన్లుగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మించనున్న భారీప్రతిష్టాత్మక చిత్రం"రాణా". ఈ చిత్రం ప్రారంభోత్సవం సమయంలోనే రజనీ కాంత్ అనారోగ్యానికి గురి కావటం, చివరికి ఆయన సింగపూర్ లో ట్రీట్ మెంట్ తీసుకుని జూలై 13 వ తేదీన చెన్నైకి తిరిగిరావటం మనకు తెలిసిందే.
తాను అనారోగ్యం నుండి కోలుకున్నందుకుగాను తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని రజనీ కాంత్ భావిస్తున్నారని ఆయన కుమార్తె సౌందర్య మీడియాకు తెలిపారు. రజనీ తిరుపతి రావటానికి తగిన ఏర్పాట్లు చేస్తానన్న ఆయన స్నేహితుడు మోహన్ బాబు మాటని సున్నితంగా కాదన్న రజనీ కాంత్ ఆగస్ట్ 14 వ తేదీన, "రాణా" చిత్రం ప్రారంభానికి ముందుగా శ్రీవారిని దర్శించుకోవాలని, ఆయన ఆశీర్వాదం పొందాలని భావిస్తున్నారు. అనంతరం తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన తన అభిమానులను కలుసుకోవటానికి తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఆయన పర్యటిస్తారట.