English | Telugu

తమిళనటుడు రవిచంద్రన్ మృతి

తమిళనటుడు రవిచంద్రన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ సీనియర్ తమిళ నటుడు రవిచంద్రన్ ఈ రోజు చెన్నైలోని తేనాం పేటలో కల ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. చనిపోయేనాటికి రవిచంద్రన్ వయస్సు 71 సంవత్సరాలు. జూలై 17 వ తేదీన రవిచంద్రన్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. రవిచంద్రన్ ఊపిరితిత్తులు, కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నారు. కానీ రవిచంద్రన్హాస్పిటల్లో చేరిన తర్వాత గత బుధవారం నాడు కోమాలోకి జారిపోయారు.

ఆయన అరవై, డబ్భై దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో చాలా చిత్రాల్లో నటించారు. శ్రీధర్ తీసిన "కాదలిక్క నేరమిల్లై" చిత్రం నటుడిగా రవిచంద్రన్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అప్పుడే రవిచంద్రన్ ప్రముఖ మళయాళ నటి షీలాని వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవటం కూడా జరిగింది. రవిచంద్రన్ గారికి హంసవర్థన్, జార్జి అనే ఇద్దరు కొడుకులున్నారు. వారు కూడా తమిళ సినీ పరిశ్రమలో నటులుగానే కొనసాగుతున్నారు. రవిచంద్రన్ ఆత్మకు శాంతి కావాలని తెలుగువన్ కోరుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.