English | Telugu

తల్లి పేరు మీద ఫ్యాన్స్ కోసం ఆ పని చేస్తున్న హీరో

గ్రూప్ డాన్సర్ గా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత డాన్సర్ గా ఎదిగి ఆ పై దర్శకుడుగా, నటుడుగా ఇలా అన్నింటిలోను బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న గొప్ప ధీరోదాత్తుడు రాఘవ లారెన్స్. తెలుగు తమిళ భాషలకి చెందిన సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే తనని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకుల కోసం అలాగే తన అభిమానుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన లారెన్స్ తాజాగా ఇంకో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

చెన్నైమహానగరంలో ఉన్నఒక ప్రధాన ఏరియాలో లారెన్స్ తన తల్లి కన్మణి పేరు మీద ఒక కల్యాణ మండపాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సందర్భంగా తను ఎందుకు ఆ కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నానే విషయాన్ని కూడా ఆయన అందరికి తెలిపాడు. తను నిర్మిస్తున్న కల్యాణ మండపంలో పేదవారు ఉచితంగా తమ పిల్లల పెళ్లిళ్లు జరిపించుకోవచ్చని అలాగే తనఅభిమానులు కూడా కల్యాణ మండపాన్ని ఉపయోగించుకోవచ్చని లారెన్స్ తెలిపాడు.ఆల్రెడీ లారెన్స్ కొంత మంది అనాధపిల్లలని దత్తత తీసుకొని వారికి ఉచిత వసతితో పాటు చదువు కూడా చెప్పిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

లారెన్స్ తాజాగా జిగర్తాండ డబుల్ ఎక్స్‌ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో లారెన్స్ నటనకి ప్రేక్షకుల నుంచి అలాగే సినీ విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి. సినిమా పిచ్చి ఉన్న కరుడుగట్టిన రౌడీ స్థాయి నుంచి ప్రజల కోసం ప్రాణాలు అర్పించే క్యారక్టర్లో లారెన్స్ చాలా అధ్బుతంగా నటించాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.