English | Telugu
దేవర ఇంటర్వెల్ సీన్.. పూనకాలు లోడింగ్!
Updated : Dec 4, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. వీలైనంత షూటింగ్ పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీ టీం దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది.
'దేవర' సినిమాలో ఇంటర్వెల్ సీన్ హైలైట్ గా నిలవనుందట. 'ఆర్ఆర్ఆర్'లో ఇంటర్వెల్ సీన్ కి ఎంత పేరు వచ్చిందో, అంతకు మించి ఉండేలా దేవర ఇంటర్వెల్ ను ప్లాన్ చేశారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో రూపొందిస్తున్న ఈ సీన్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ సీన్స్ లో ఒకటిగా నిలవనుందని చెబుతున్నారు. థియేటర్లలో ఈ సీక్వెన్స్ కి అభిమానులు పూనకాలతో ఊగిపోవడం ఖాయమని అంటున్నారు.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.