English | Telugu
నితిన్ దెబ్బకి దిగొచ్చిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
Updated : Dec 4, 2023
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గుంటూరు కారం' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా'కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ త్వరలో సెకండ్ సింగిల్ వస్తుందని ప్రకటించాడు.. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో రెండో పాట ఎప్పుడంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గట్టిగా అడుగుతున్నారు. తాజాగా వారికి హీరో నితిన్ కూడా తోడు కావడంతో నిర్మాత తప్పక తాజా అప్డేట్ ఇచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
'మ్యాడ్' మూవీ విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, "మా సినిమా చూసి మీకు నవ్వు రాకపోతే మీ డబ్బులు వెనక్కిస్తాం" అన్నాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తన కొత్త సినిమా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ "మా సినిమా చూసి మీరందరూ కడుపుబ్బా నవ్వకపోతే.. మీ డబ్బులు వంశీ గారు వెనక్కిస్తారు" అని సరదాగా అన్నాడు.
నితిన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగవంశీ "ఆ రోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేసాం.. మీరు ఇలా లాక్ చేస్తే ఎలా" అని ట్వీట్ చేశాడు. దానికి బదులిచ్చిన నితిన్ "ఏదో ఎక్స్ ట్రా ఆర్డినరీ వైబ్ లో నేనూ అనేసా. అది ఓకే కానీ, గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్నాం. అప్డేట్ ఎప్పుడు ఇంతకీ" అంటూ ఇరికించేశాడు. దీంతో ఇక తప్పక వంశీ గుంటూరు కారం అప్డేట్ ఇచ్చేశాడు. "పనులు జరుగుతున్నాయి. ఇంకో రెండ్రోజుల్లో సూపర్ అనౌన్స్‌మెంట్ ఇస్తాం" అని తెలిపాడు. దీంతో మహేష్ ఫాన్స్ సంబరపడుతున్నారు.