English | Telugu

పవన్ కళ్యాణ్ హాష్ టాగ్ వైరల్ అవ్వడానికి ఈ మూడే ప్రధాన కారణం 

తెలుగు నాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దాదాపుగా అందరు వీరాభిమానులే. ఈ లిస్ట్ లో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు పవన్ గురించి సదరు నటులు చెప్పే మాటలు వైరల్ కూడా అవుతుంటాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ హాష్ టాగ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఎక్స్ లో వైరల్ గా మారింది.ఇందుకు ప్రధాన కారణాలు మూడు. అందులో ఒకటి మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి(pankaj tripathi)పవన్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు పవన్ గొప్ప నటుడు, పుస్తకాలు బాగా చదవడంతో పాటుగా ఎంతో దూర ద్రుష్టి ఉన్న వ్యక్తి కూడా. ఈ విషయాన్ని కొంత మంది దర్శకులు నాతో చెప్పారు.ఆయనకి అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చాడు.

ఇక మిగతా రెండు విషయాలకి వస్తే పవన్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన హరి హర వీరమల్లు(hari hara veeramallu)లో పవన్ ఒక సాంగ్ పాడబోతున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఈ మేరకు చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అలాగే మరో అప్ కమింగ్ మూవీ ఓజీ(og)లో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో పాట పాడబోతున్నాడనే న్యూస్ కూడా హల్ చల్ చేస్తుంది.ఈ మూడు విషయాల వల్లనే పవన్ హాష్ టాగ్ వైరల్ గా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.