English | Telugu

వచ్చే ఏడాదే దేవర పార్ట్-2

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన 'దేవర' (Devara) మూవీ ఇటీవల విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాని ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు అప్పుడే 'దేవర-2' ఎప్పుడు మొదలవుతుందనే చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే వచ్చే ఏడాది నుంచే 'దేవర-2' షూట్ షురూ కానుందని తెలుస్తోంది. (Devara 2)

ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇప్పటికే 'వార్-2' షూటింగ్ కొంతభాగం పూర్తి చేసిన ఎన్టీఆర్.. త్వరలోనే నీల్ ప్రాజెక్ట్ షూట్ ని కూడా ప్రారంభించనున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ లను వచ్చే ఏడాది ఆగష్టు, సెప్టెంబర్ కల్లా పూర్తి చేసేలా ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడట. ఈ లోపు కొరటాల కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తాడని, వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి 'దేవర-2' షూట్ మొదలు పెట్టేలా సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. 'దేవర'లో మీరు చూసింది 10 శాతమే అని, 'దేవర-2' ఓ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే కొరటాల చెప్పాడు. ఆయన మాటలను బట్టి చూస్తే.. 'దేవర-2' అత్యంత భారీగా ఉండబోతుందని అర్థమవుతోంది.

అన్ని అనుకున్నట్టు జరిగి 'దేవర-2' వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి స్టార్ట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నుంచి 'ఆర్ఆర్ఆర్', 'దేవర' అనే రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన మునుపటిలా వేగంగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ అడుగులు ఉంటున్నాయి. ఈ ఏడాది దేవరతో పలకరించాడు. 2025 ఆగష్టులో 'వార్-2', 2026 జనవరిలో నీల్ ప్రాజెక్ట్ విడుదల కానున్నాయి. ఇక 'దేవర-2' కూడా 2026 ద్వితీయార్థంలో లేదా 2027 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశముంది. అంటే ఇక మీదట ఎన్టీఆర్ నుంచి ఏడాదికి కనీసం ఒక సినిమా రానుంది అన్నమాట.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.