English | Telugu

పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎంత? అప్పులు ఎంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ వేరు. ఆయన పేరు వింటేనే అభిమానులు చొక్కాలు చించుకుని, కాల‌ర్ఎగరేసేలా ఉంటాయి. ఆయన తొడిగిందే ఫ్యాషన్ అయిన రోజులు ఉన్నాయి. ఆయన మాటే శాసనంగా మారిన సందర్భాలు ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ చరిష్మా కంటే ఆయన వ్యక్తిత్వానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. తెలుగు యువతను ఈ స్థాయిలో ప్ర‌భావితం చేసిన హీరో మ‌రొక‌రు ఉండకపోవచ్చు. ఓవైపు రాజకీయాలు.... మరోవైపు సినిమాలు. ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. ఎన్నో దానాలు చేస్తున్నారు. ప‌వ‌న్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా అంద‌రు ఆర్ధికంగా ఆయ‌న‌కేమి అనుకుంటారు. సినిమాకి వంద కోట్లు తీసుకునే ఆయ‌న కోట్లాను కోట్లు వెన‌క వేసుకుని ఉంటాడ‌ని భావిస్తారు. తాజాగా ప‌వ‌న్ సోద‌రుడు నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకునే పవన్ కు అప్పులు ఉన్నాయంటే చాలామంది ఆశ్చర్యపోతారు.

పార్టీ కోసం ప్రజల కోసం తన సంపాదన నుంచి సహాయం చేస్తుంటారు. జనసేన స్థాపించిన సమయంలో పిల్లలపై ఫిక్స్ డిపాజిట్ వేశారు అనే వార్తలు కూడా నిజమే. ఆయన ఆస్తులు ప్రస్తుతం తాకట్టులోనే ఉన్నాయి. ఆయనకంటూ ఆస్తులు ఏమీ లేవు. ఒక్క ఫామ్ హౌస్ ఉంది. అతనికి ఒకే ఒక ఆస్తి ఎనిమిది ఎకరాల పొలం మాత్రమే. ఎంతో ఇష్టంతో కొనుక్కున్నారు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తాను తీసుకున్న కోటిన్నరను డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేశారు. తన సేవింగ్స్ కూడా కొన్ని వాళ్లకే ఇచ్చారు. ఆ ఎనిమిది పొలం కూడా ఇచ్చేస్తానని చెప్పారు. అప్పుడు దాని విలువ 15 లక్షల వరకు ఉంది. నేను అడ్డుపడి ఆపాను. రెమ్యూనరేషన్ ఇచ్చేశావు... సేవింగ్స్ ఇచ్చేశావు. ఇష్టపడి కొనుక్కున్న ఈ పొలం అమ్మడం దేనికి అని అడ్డుపడ్డాను. తనకున్న ఇల్లు, కారు కూడా లోన్ లోనే ఉన్నాయి. ఆస్తులు కూడ‌బెట్టాల‌నే మనస్తత్వం ఆయనకు లేదు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.