English | Telugu
తాత,తండ్రి, మేనమామల నట వారసుడి పుట్టిన రోజు
Updated : Nov 23, 2023
సిల్వర్ స్క్రీన్ మీద ఆ హీరో నటన చూస్తుంటే మన పక్కింటి కుర్రోడు తన కథ ని మనతో పర్సనల్ గా చెప్పుకుంటున్నట్టుగా ఉంటుంది. ఎలాంటి క్యారక్టర్ వేసినా సరే హడావిడి చెయ్యకుండా సింపుల్ గా నటించి ఆ క్యారక్టర్ ని ప్రేక్షకుల గుండెల్లో నిలబడి పోయేలా చేస్తాడు.ఆ హీరో నట వారసత్వం ఈ రోజుది కాదు.కొన్ని దశాబ్డల నుంచి తెలుగు సినిమా రంగంలో ఎంతో ఘనమైన కీర్తి ఉన్న నట వారసత్వానికి ఆ హీరో ప్రస్తుత ప్రతినిధి.తన తాత, తండ్రి, మేనమామ ముగ్గురు కూడా కళామతల్లి బిడ్డలే. ఆ ముగ్గురి ఛరిష్మాని కంటిన్యూ చేస్తు ముందుకు దూసుకుపోతున్నఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగ చైతన్య.. ఈ రోజు చైతన్య పుట్టిన రోజు.
2009 వ సంవత్సరంలో వచ్చిన జోష్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చై మొదటి సినిమాకే ఫిలిం ఫేర్ అవార్డు అందుకొని టాక్ అఫ్ ది తెలుగు సినిమాగా మారాడు. ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో యూత్ మొత్తానికి అభిమాన కధానాయకుడిగా మారాడు. ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయి ప్రేమ కోసం పరితపించే యువకుడి పాత్రలో చై నటన ప్రేక్షులందర్నీ కట్టిపడేస్తుంది. నేటికీ ఆ సినిమాలోని పాటలు చాలా చోట్ల మారుమోగిపోతుంటాయి. ఆ తర్వాత వచ్చిన 100 % లవ్, తడాఖ, మనం ,ప్రేమమ్ ,మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ ఇలా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసి తన కంటూ సొంతంగా అభిమానగణాన్ని చైతన్య సంపాదించుకున్నాడు .
మరికొన్ని రోజుల్లో దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చై లేటెస్ట్ గా తండేల్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీలో బెస్తవాడి క్యారక్టర్ ద్వారా తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు.ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చైతన్య బర్త్ డే సందర్భంగా నిన్న విడుదల అయ్యి రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టిస్తుంది. ఇవే కాకుండా మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో చై తన అభిమానులని ,ప్రేక్షకుల్నిఅలరించడానికి సిద్ధం అవుతున్నాడు