English | Telugu
'రంగబలి' రెండో సింగిల్ వచ్చింది!
Updated : Jun 19, 2023
నాగశౌర్య హీరోగా నటిస్తోన్న ఎంటర్‌టైనర్ 'రంగబలి'. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యుక్తి తరేజా నాయికగా నటిస్తోన్న ఈ మూవీని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు చక్కని స్పందన వచ్చింది.
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు మేకర్స్ 'లవ్ స్టోరీ' ఫేమ్ పవన్ సిహెచ్. స్కోర్ చేసిన సెకండ్ సింగిల్ 'కల కంటూ ఉంటే' పాటని విడుదల చేశారు. మొదటి పాట మాస్ నంబర్ అయితే, రెండవది మంత్రముగ్ధులను మెలోడీ. శౌర్య, యుక్తి మధ్య ఉన్న అందమైన బంధాన్ని ఈ పాట చూపిస్తుంది. సార్థక్ కళ్యాణి, వైష్ గానం వినసొంపుగా ఉంది. కృష్ణకాంత్ సాహిత్యం ఆకట్టుకుంటోంది. నాగ శౌర్య, యుక్తి కెమిస్ట్రీ అందంగా వుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
జూలై 7న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకి దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.