English | Telugu

వైరల్ గా మారిన విష్ణుప్రియ చేసిన పానకం!

బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది.

విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది.

కాగా ఇప్పటికే తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న విష్ణుప్రియ తన ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు చెప్పింది. రెగ్యులర్ గా జ్యువలరీ, డ్రెస్, ఫోటోషూట్స్ తో బిజీగా ఉండే విష్ణుప్రియ.. తన ఇంట్లో ఫస్ట్ టైం పానకం ట్రై చేసిందంట.. అది టేస్ట్ చేయగా.. సో యమ్మీ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో పోస్ట్ చేసింది. కాగా తన అభిమానులు సూపర్ అంటూ మెసెజ్ లు చేస్తున్నారు. అయితే తను రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో నటించిందని చెప్పింది. త్వరలోనే ఆ వివరాలు షేర్ చేస్తానని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.