English | Telugu

ఫోటో లీక్.. లండన్ లో శోభితతో నాగ చైతన్య!

హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో అక్కినేని హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు పదే పదే వార్తలు వినిపిస్తున్నాయి. మేజర్ ప్రమోషన్స్ సమయంలో 'శోభిత స్టే చేసిన హోటల్ దగ్గర చైతన్య', 'నాగ చైతన్య కొత్త ఇంటి దగ్గర శోభిత' వంటి వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఇద్దరూ కలిసి లండన్ లో ప్రత్యక్షమయ్యారు.

సమంతతో విడాకులైన కొంతకాలం నుంచే చైతన్య-శోభిత డేటింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఫోటో కారణంగా ఈ న్యూస్ మళ్ళీ తెరపైకి వచ్చింది. చైతన్య లండన్ లోని ఒక రెస్టారెంట్ కి వెళ్లగా, అక్కడ చెఫ్ చైతన్యతో ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఫొటోలో వెనుక ఓ టేబుల్ దగ్గర శోభిత కూర్చున్నట్లుగా ఉంది. దీంతో శోభితతో కలిసి లండన్ వెళ్ళావా చైతన్య? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే చైతన్య-శోభిత నిజంగానే డేటింగ్ ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశముందని అంటున్నారు. మరి ఆ ఫొటోలో ఉంది శోభితనేనా? ఒకవేళ శోభితనే అయితే ఆమెతో చైతన్య డేటింగ్ వార్తలు నిజమేనా? అనే చర్చలు సాగుతున్నాయి.

గతంలో శోభితతో ప్రేమ వ్యవహారంపై చైతన్యను మీడియా ప్రశ్నించగా నవ్వి ఊరుకున్నాడు. మరి త్వరలోనైనా దీనిపై చైతన్య క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.