English | Telugu
మమ్ముట్టి, మోహన్ లాల్ పై ఐ.టి.రైడ్
Updated : Jul 22, 2011
మమ్ముట్టి, మోహన్ లాల్ పై ఐ.టి.రైడ్ జరిగింది. వివరాల్లోకి వెళితే మళయాళం సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. కొచ్చి, చెన్నై, బెంగుళూర్లలో కల వీరి నివాసాలపై ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో విలువైన డాక్యుమెంట్లు కొన్ని దొరికాయని తెలిసింది. వీరి మీద ఆదాయపు పన్ను శాఖ చాలా కాలం నుండీ నిఘా పెట్టి తగిన ఆధారాలు దొరికి తర్వాతే ఈ దాడులను నిర్వహించిందట.
అలాగే కన్నడ స్టార్స్, పంపిణీదారులు రవికిరణ్, సిహికహి చంద్రుల ఇళ్ళపై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఆదాయపు శాఖ మమ్ముట్టి, మోహన్ లాల్ ఇళ్ళపై నిర్వహించిన ఈ దాడులను గమనించిన తమిళ స్టార్లు తమ ఇళ్ళపై కూడా ఆదాయపు శాఖ దాడులు చేసే అవకాశముందని భయపడుతున్నారు. ఆ దాడులను ఎలా ఎదుర్కోవటానికి ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తమిళ సినీ వర్గాలంటున్నాయి.