English | Telugu
'బూతు' ముద్ర చెరిగిపోయిందా??
Updated : Sep 5, 2015
ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలు చూసినవాళ్లెవరైనా మారుతి సినిమా అంటే ఫ్యామిలీలతో వెళ్లడానికి భయపడిపోతారు. ఆసినిమాలో ఆయనచూపించిన బూతు ఆ రేంజులో ఉంది మరి. ఆ తరహా సినిమాలు తీసినవాళ్లంతా మారుతి పేరుని తగిలించి... తమ సినిమాల్ని అమ్ముకొన్నారు. కొత్త జంటతో క్లీన్ సర్టిఫికెట్ సంపాదించుకొందామని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఎందుకంటే ఆ సినిమాలోనూ గే తరహా కామెడీ ఒకటి వదిలారు. అందులోనూ బూతు ధ్వనించింది. అయితే మారుతి మేకవర్ పూర్తి స్థాయిలో కనిపించిన చిత్రం మాత్రం.. భలే భలే మగాడివోయ్ అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ మహిమో, లేదంటే నానీనే కండీషన్లు పెట్టాడో తెలీదుగానీ... ఈసినిమాలో `బూతు` లేకుండా క్లీన్ గా తీయగలిగాడు మారుతి.
వినోదం పండించడంలో తనకంటూ ఓ స్టైల్ ఉందని ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు. భలే భలే మగాడివోయ్, ఈరోజుల్లో తీసిన దర్శకుడు ఒక్కడేనా??? అనే అనుమానం వచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దిన మారుతి.. తనపై పడిన బూతు ముద్రను చెరిపివేసుకొనే ప్రయత్నంలో విజయం సాధించాడనే చెప్పాలి.