English | Telugu

నాని... అప్పుల పాలైపోయాడా??

యువ హీరో నాని అప్పుల పాలైపోయాడ‌ని, సినిమాల‌కు ఫైనాన్స్ చేసి చేసి దివాళా తీసేశాడ‌ని, ఆ అప్పులు తీర్చుకోవ‌డానికి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడ‌న్న పుకారు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో షికారు కొడుతోంది. రెండేళ్ల క్రితం డీ ఫ‌ర్ దోపిడీ సినిమాకి నిర్మాత‌గా నాని కార్డు టైటిల్స్ ప‌డింది. ఆ సినిమా ద్వారా నాని భీక‌రంగా న‌ష్ట‌పోయాడ‌ని, దాంతో పాటు కొన్ని సినిమాల‌కు ఫైనాన్స్ చేశాడ‌ని టాక్‌. దీనిపై నాని స్పందించాడు.

నాకు అప్పులేంటి? అంత అవ‌స‌రం నాకేమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నాడు నాని. డీ ఫ‌ర్ దోపిడీకి తన పేరు నిర్మాత‌గా ప‌డిన మాట వాస్త‌వ‌మే అయినా, తాను ఆ సినిమా కోసం రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని, సినిమాకి క్రేజ్ పెర‌గ‌డానికి త‌న పేరు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అడిగార‌ని, తాను ఒప్పుకొన్నాన‌ని అంతే త‌ప్ప తాను ఆ సినిమాకి నిర్మాత‌నేం కాద‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ తాను న‌టించిన ఏ సినిమాకీ ఆర్థికంగా సాయం చేయ‌లేద‌ని, అలాంట‌ప్పుడు అప్పులు చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కెందుకొస్తుంద‌ని అంటున్నాడు నాని. నాని స్టేట్ మెంట్ తో ఈ పుకారుకి పుల్ స్టాప్ ప‌డిన‌ట్టే.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.