English | Telugu
‘మనసా వాచా కర్మణా’ చిత్రం రివ్యూ
Updated : Feb 15, 2023
చిత్రం: మనసా వాచా కర్మణా!
తారాగణం: విక్రమాదిత్య, స్నేహ మాధురి శర్మ, విజయ, మమతా నారాయణ్ తదితరులు.
ప్రొడ్యూసర్ : K&M Studios
కథ, డైరెక్టర్ : కృష్ణమూర్తి
సినిమాటోగ్రఫీ : చందు AJ
డిఐ : Dolly studios
ఎడిటింగ్ : శ్రీ వర్కాలా, పి. రాజ్ కుమార్
VFX: రాజేశ్ పాల, ప్రసన్నా మారుతోటి
మ్యూజిక్ & లిరిక్స్: కరణం శ్రీ రాఘవేంద్ర.
ఓటిటి : CLASC
ఎందరో యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఓటీటీ ద్వారా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వెబ్ సిరీస్ లు, సినిమాలతో కొత్త కంటెంట్ కి బాటలు వేస్తున్నారు నేటితరం డైరెక్టర్స్. ప్రస్తుతం ఓటీటీ ల హవా నడుస్తోంది. కొత్త కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో CLASC ఒకటి. ఇందులో తాజాగా విడుదలైన 'మనసా వాచా కర్మణా' మూవీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం!
కథ:
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లోని కథలన్నీ దాదాపు ప్రేమికుల చుట్టే తిరుగుతున్నాయి. కానీ ఈ కథ.. సూర్యుడు, భూమి మధ్య ఉండే ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు సూర్యుడు ఆకాశంలో ఒంటరిగా భగభగ మండిపోతూ కన్పిస్తుంటాడు. అతన్ని వెతుక్కుంటూ అవని(భూమి) వస్తుంది. ఇంతలో అవనికి సూర్యుడు చేసిన ప్రామిస్ గుర్తొస్తుంది. సూర్యుడు దానిని నెరవేర్చకుండా అది వదిలేసి చంద్రకళతో క్లోజ్ గా ఉండటం చూసి బాధపడుతుంది. చంద్రకళ(చంద్రుడు) ను సూర్యుడు ఇష్టపడుతున్నాడేమోనని భావించి కోపంతో రగిలిపోతుంది. అయితే అవని కోపాన్ని చూసి సూర్యుడికి ఏం చేయాలో తెలియక.. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన గంగని పిలుస్తాడు. "నా ప్రేమని ఎలాగైనా నువ్వే కాపాడాలి గంగ" అని చెప్పి గంగని నేలమీదకి పంపిస్తాడు సూర్యుడు. అలా ఆకాశం నుండి నేలమీదకి జారిపడిన గంగతో హీరోయిన్ పాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత సూర్యుడు హీరోగా సూర్య(విక్రమాదిత్య) , భూమి హీరోయిన్ గా అవని(స్నేహ మాధురి శర్మ), చంద్రకళ(విజయ) పాత్రగా చందమామ పరిచయమవుతారు. గంగ అవని దగ్గరకి వెళ్తుంది. అవని ఎంత డోర్ కొట్టినా తీయకపోగా.. తోసుకొని వెళ్తుంది. అక్కడ డోర్ ఓపెన్ లో ఉంటుంది. లోపలికి వెళ్ళి చూడగా అవని పడుకొని ఉంటుంది. అవనిని లేపి.. ఏమైందని గంగ అడుగుతుంది. దానికి అవని.. "సూర్య నా ప్రేమని కాదన్నాడు" అని చెప్తుంది. సూర్య అసలు అవని ప్రేమను ఎందుకు కాదన్నాడు? గంగ వాళ్ళిద్దరిని కలిపిందా? అసలు వారిద్దరి మధ్యలో చంద్రకళ పాత్రేంటి? తెలియాలంటే CLASC అనే ఓటిటిలోని ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
సూర్యచంద్రులతో పాటుగా భూమి కూడా తిరుగుతుంది. అయితే వీటిలో ఏది లేకపోయినా.. దేనికి నష్టం జరిగినా మనిషి జీవితం స్తంభించిపోతుంది. అయితే అలాంటి విషయాన్ని సింపుల్ గా తెలియజేస్తూ భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న ప్రేమను ఆకట్డుకునేలా చూపించాడు డైరెక్టర్.
ఎక్కడా కూడా అడల్ట్ సీన్స్ లేకుండా.. కథ నుండి డైవర్ట్ కాకుండా అలా చివరివరకూ ప్రేక్షకుడిని కూర్చొబెట్టి చూపే ప్రయత్నంలో డైరెక్టర్ క్రాంతి మూర్తి సక్సెస్ అయ్యాడు. సూర్య, అవని క్యారెక్టర్ లను ఎక్కడా కూడా డైవర్ట్ చేయకుండా కథతోనే ఉంటూ.. అవసరమైతేనే మాటలను కలుపుతూ చక్కగా తీర్చిదిద్దిన తీరు బాగుంది. మనకు ఈ అవని చాలా ఇచ్చింది. దానికి మనం ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నాశనం చేయకపోతే చాలు అనే థీమ్ తో ముందుకొచ్చారు 'మనసా వాచా కర్మణా' మేకర్స్.
చందు AJ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్రాణం పోసింది. ముఖ్యంగా ప్రకృతిని మనకు పరిచయం చేసే తీరు బాగా కనెక్ట్ అవుతుంది. రాజేశ్ పాల, ప్రసన్నా మారుతోటి అందించిన VFX & DI అదనపు హంగులను జోడించాయి. కరణం శ్రీ రాఘవేంద్ర అందించిన సంగీతం ఆకట్టుకుంది.
నటీనటుల పనితీరు:
సూర్యగా విక్రమాదిత్య ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అవని పాత్రలో స్నేహ మాధురి శర్మ ఆకట్టుకుంది. చంద్రకళగా విజయ ఉన్నంతలో బాగానే చేసింది. సపోర్టింగ్ రోల్ లో గంగగా చేసిన మమతా నారాయణ్ బెస్ట్ సపోర్టింగ్ ఇచ్చింది.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ప్రకృతి ప్రేమ ఇవ్వటమే కాదు దానికి కోపం వస్తే ఏం జరుగుతుందో తెలిపిన ఈ మూవీని ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు.
రేటింగ్: 3.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్