English | Telugu

విశాల్‌కి షాకిచ్చిన మ‌ద్రాస్ హైకోర్ట్‌

తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో విశాల్ తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధ‌మైంది. అస‌లు పోటీలో ఉంటుద‌నుకున్న ఇత‌ర చిత్రాలు కూడా త‌ప్పుకోవ‌టంతో విశాల్ చాలా సంబ‌ర‌డ్డాడు. వినాయ‌క చ‌వితికి త‌న సినిమానే సోలో రిలీజ్ అని అనుకున్నారు. అయితే మద్రాస్ హైకోర్ట్ హీరోకి అనుకోని షాకిచ్చింది. ‘మార్క్ ఆంటోని’ సిినిమా రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది. అందుకు కార‌ణం.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ గ‌తంలో త‌మ‌కు విశాల్ డ‌బ్బులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. వీరికి విశాల్ రూ. 21.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.15 కోట్లు క‌ట్టాల‌ని అప్ప‌ట్లో కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.

అయితే విశాల్ ఇప్ప‌టి వ‌ర‌కు తాను చెల్లించాల్సిన రూ.15 కోట్ల మొత్తాన్ని చెల్లించ‌లేదు. దీంతో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌రోసారి కోర్టు మెట్లెక్కింది. కోర్టు ఆదేశాల మేర‌కు విశాల్ చెల్లించాల్సిన మొత్తాన్ని ఇంకా చెల్లించ‌క‌పోవ‌టంతో త‌న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ రిలీజ్‌పై మ‌ద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఇక మ‌రో ఐదారు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. మ‌రిప్పుడు విశాల్ ఈ వ్య‌వ‌హారంపై ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

‘మార్క్ ఆంటోని’ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో తెర‌కెక్కిన సినిమా. ఇందులో విశాల్‌ డిఫ‌రెంట్ రోల్స్‌లో మెప్పించడానికి రెడీ అయ్యారు. అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌.వినోద్ కుమార్ నిర్మాత‌. జి.వి.ప్ర‌కాష్ సంగీతాన్ని అందించారు. వెర్సటైల్ డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ ఎస్‌.జె.సూర్య ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. విశాల్‌కి మంచి హిట్ వ‌చ్చి చాలా కాల‌మే అయ్యింది. మార్క్ ఆంటోనిపైనే త‌ను ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో అనుకోకుండా లైకా ప్రొడ‌క్ష‌న్స్ విశాల్‌కి షాకిచ్చింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.