English | Telugu
చెన్నై హైకోర్ట్ లో లియో సినిమా
Updated : Oct 16, 2023
ఇప్పుడు తమిళనాట రాష్ట్ర వ్యాప్తంగా ఏ నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నా ఒకటే మాట.. లియో సినిమా టికెట్ దొరికిందా అని.. అంతటి క్రేజ్ ని విజయ్ లియో మూవీ సంపాదించుకుంది. లోకేష్ కనగ రాజ్ ,విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న లియో మూవీ కోసం తమిళ చిత్ర పరిశ్రమ తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. ఇలాంటి టైం లో లియో మూవీ నిర్మాతలు మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించడం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అయ్యింది.
దళపతి విజయ అభిమానులు ఏ పని చేస్తూ ఉన్నా సరే గంటకి ఒకసారైనా క్యాలెండర్ వైపు చూస్తుంటారు. ఎందుకంటే తమ అభిమాన హీరో నటించిన లియో మూవీ ఈ నెల 19 వ తారీఖున విడుదల కాబోతుంది. దీంతో ఎప్పుడెప్పుడు పంథొమ్మిదివ తారీకు వస్తుందా అని దళపతి ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే అప్పుడే తమిళనాడులోని చాలా థియేటర్లుని విజయ్ ఫాన్స్ విజయ్ కటౌట్ లతో నింపేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా విజయ్ అభిమానుల కోలాహలం కనపడుతుంది.
ఇప్పుడు విజయ్ అభిమానులలో ఆనందాన్ని ఇంకొంచం ముందే తీసుకురావాలని చెప్పి లియో నిర్మాతలు చెన్నై హైకోర్టు లో ఒక పిటిషన దాఖలు చేసారు. లియో సినిమా రిలీజ్ రోజున తెల్లవారు జామున 4 గంటల నుంచే షోస్ వేసుకునేలా అనుమతి ఇవ్వాలని అలాగే వారం రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచే షో స్ వేసుకునేలా కూడా అనుమతి ఇవ్వాలని నిర్మాతలు చెన్నై కోర్ట్ లో పిటీషన్ వేశారు. కాగా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం లియో సినిమాకి అదనపు షో ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చింధి. ఉదయం 9 గంటల కి ఒక షో వేసుకునేలా అనుమతి ఇచ్చింది. కాగా లియో నిర్మాతలు వేసిన పిటిషన్ ని చెన్నై హైకోర్ట్ రేపు విచారించనుంది.