English | Telugu
'భగవంత్ కేసరి' బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్!
Updated : Oct 16, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ కాగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఇద్దరూ తమ ట్రాక్ మార్చి చేసిన 'భగవంత్ కేసరి'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇందులో మాస్ మెచ్చే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే బలమైన ఎమోషన్స్ ఉండటంతో.. ఇది దసరా పండుగ సీజన్ కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అనే అభిప్రాయాలు ఉన్నాయి. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి ఘన విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఇటీవల యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య వరుసగా మూడోసారి యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా దాదాపు బుకింగ్స్ ఓపెన్ అయిన అన్ని ఏరియాల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. 'భగవంత్ కేసరి' బాలయ్య కెరీర్ లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది.