English | Telugu
'తమ్ముడు' కాదు.. 'ఎక్స్ ట్రా'తో యాంగ్రీ మ్యాన్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
Updated : Oct 16, 2023
యూత్ స్టార్ నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'తమ్ముడు'లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు రాజశేఖర్ మంచి డెసిషన్ తీసుకున్నారని, సెకండ్ ఇన్నింగ్స్ అదరగొడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే నితిన్ సినిమాలో రాజశేఖర్ నటించడం నిజమే కానీ.. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది మాత్రం 'తమ్ముడు' సినిమాతో కాదు. నితిన్ 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్'. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోమవారం ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నారు. ఆయన ఈరోజు సెట్స్‌లోకి అడుగు పెట్టారు. ఎంటైర్ టీమ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాజశేఖర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సడెన్ సర్‌ప్రైజింగ్ అనౌన్స్మెంట్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఇదొక క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ, కచ్చితంగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుందని డైరెక్టర్ వక్కంతం వంశీ తెలిపారు. హేరిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.