English | Telugu
కోటబొమ్మాళి పీఎస్.. ఇవెక్కడి కలెక్షన్లురా సామి!
Updated : Nov 26, 2023
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. మలయాళం ఫిల్మ్ 'నాయట్టు'కి రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి తేజ మార్ని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.
కోటబొమ్మాళి మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.1.75 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు అంతకు 50 శాతం ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.4.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో మరో రూ.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే ఛాన్స్ ఉంది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ ఈ సినిమా రూ.10 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది.