English | Telugu

సల్మాన్ నో ఎంట్రీ 2 కి కోన వెంకట్ కథ

సల్మాన్ "నో ఎంట్రీ 2" కి కోన వెంకట్ కథనందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సిసియల్ ( సెలెబ్రిటీస్ స్రికెట్ లీగ్) జరిగిన సందర్భంగా సల్మాన్ ను కోన వెంకట్ కలవటం జరిగింది. ఆసందర్భంలో తాను హిందీలో నటించగా సూపర్ హిట్టయిన "రెడీ" సినిమా మూలమైన తెలుగు "రెడీ" చిత్రానికి కథనందించినది కోన వెంకటేనన్న విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తనకు కూడా ఒక మంచి కథను తయారుచేయమని కోన వెంకట్ ని కోరటం జరిగింది.

అప్పటి నుండీ సల్మాన్ ఖాన్ కి కథను తయారుచేసే ప్రయత్నంలో ఉన్న కోన వెంకట్ ఆ మధ్య ముంబాయి వెళ్ళి సల్మాన్ కి ఒక కథను చెప్పటం, ఆ కథ అతనికి నచ్చటంతో "నో ఎంట్రీ 2" సినిమా తయారవటానికి రంగం సిద్ధమైంది.ఆ విధంగా సల్మాన్ "నో ఎంట్రీ 2" కి కోన వెంకట్ కథనందిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆశిన్ హీరోయిన్ గా ఒక సినిమాలో నటించటానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.