English | Telugu
కీర్తీ సురేష్‌కి వంట చేయడం తెలుసా?
Updated : Aug 2, 2023
హీరో, హీరోయిన్లకు వంట చేయడం వచ్చా? రాదా? అనే ప్రశ్న చాలా మందిని ఊరిస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా నయనతార కూడా తన వంట గురించి మాట్లాడారు. ఎవరైనా ఇంటికి వస్తే, వాళ్లకు ఏం కావాలన్నా శుభ్రంగా వండిపెడతానని అన్నారు. తనకు అన్ని రకాల వంటల మీద పట్టు ఉందని చెప్పారు నయనతార. ఎప్పుడూ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసే నయనతార, మంచి మసాలా బిర్యానీ వండుతారన్న విషయం పలువురిని ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు కీర్తీ సురేష్ కూడా అలాంటి విషయాన్నే షేర్ చేసుకున్నారు. ఎప్పుడూ వంట కోసం ఇతరుల మీద ఆధారపడటం కాదు, నచ్చినవి వండుకుని తినడం కూడా కళేనని అంటున్నారు నటి కీర్తీ సురేష్. అంతకు ముందు తనకు వంట పెద్దగా తెలియదని, కోవిడ్ సమయంలో తాను చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు కీర్తీ సురేష్. అంతే కాదు, బ్రేక్‌ఫాస్ట్‌కీ, భోజనానికి మధ్య పెద్దగా గ్యాప్ లేనప్పుడు తాను టర్కిష్ రెసిపీలను ప్రిఫర్ చేస్తానని చెప్పారు. అందులో పోచ్డ్ ఎగ్స్ అంటే చాలా ఇష్టమని అన్నారు. పెరుగులో ఉప్పు, వెల్లుల్లిపాయ మిక్సర్ వేసి గిలక్కొట్టుకుని ప్లేట్‌లో పక్కనపెట్టుకోవాలి. మరో బౌల్‌లో నీళ్లు వేడి చేసుకుని అందులో కాస్త వెనిగర్ వేసి, గుడ్డుకొట్టుపోసి, ఉడికిన గుడ్డును దీని మీద వేసుకుని పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే రెడీ అయినట్టే అంటున్నారు కీర్తీ సురేష్. పోషకాలు పుష్కలంగా ఉండే ఇలాంటి వంటలను తాను తరచూ చేయడానికి ప్రిఫర్ చేస్తానని అన్నారు కీర్తీ సురేష్.