English | Telugu

నా బ్లడ్ లో నా దేశపు కల్చర్ ఉంది.. ఇమాన్వి సంచలన పోస్ట్ 

ప్రభాస్,(Prabhas)హను రాఘవపూడి(Hanu Raghavapudi)కాంబోలో రూపొందుతోన్న 'ఫౌజి'(Fauji)లో సోషల్ మీడియా స్టార్ 'ఇమాన్వీ ఇస్మాయిల్(Imanvi Esmail)హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీ కుటుంబం పాకిస్తాన్ లోని కరాచీకి చెందినదని, ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ పాకిస్తాన్ సైనిక అధికారి కాబట్టి ఇమాన్వీని 'ఫౌజి' నుంచి హీరోయిన్ గా తొలగించాలని పలువురు కోరుతున్నారు. లేదంటే మూవీని బాయ్ కాట్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.

ఈ వివాదంపై ఇమాన్వి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్ లో 'పహల్ గమ్(Pahal Gam)లో జరిగిన దాడి తర్వాత నాపై నా కుటుంబంపై తప్పుడు కధనాలు వస్తున్నాయి.నాకు, నా కుటుంబానికి గాని గతంలో గాని,ఇప్పుడు గాని పాకిస్థాన్ దేశంతో ఎలాంటి సంబంధాలు లేవు. నా తండ్రికి పాకిస్థానీ ఆర్మీ లో కూడా పని చేయలేదు. నా పై ద్వేషాన్ని కలిగించాలనే ఏకైక ఉదేశ్యంతో పూర్తి పరిశోధన చెయ్యకుండా, పేరున్న వార్తా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. పహల్గాం ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో నా గుండె తరుక్కుపోయింది. ఇలాంటి ఘటనల్ని ఖండించాలి. ఒక ఆర్టిస్ట్‌గా నిరంతరం ప్రేమను పంచాలనే ప్రయత్నిస్తాను.


నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడే భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. నేను లాస్ ఏంజిల్స్‌లో పుట్టాను. ఆర్ట్స్, యాక్టర్, కొరియోగ్రఫర్, డ్యాన్సర్ వంటి కోర్సుల్ని ఇక్కడే చేశాను. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. అందుకే ఇండియన్ అమెరికన్ అని గర్వంగా చెప్పుకుంటాను. సోషల్ మీడియాలో నా రీల్స్ చూసి నాకు మూవీలో అవకాశం వచ్చింది. నా బ్లడ్ లో ఇండియన్ కల్చర్ నిండి ఉంటుంది. కళ ద్వారా నేను కూడా ఈ ప్రపంచానికి ఇండియన్ గొప్పదనాన్ని చాటి చెబుతానని ఇమాన్వీ చెప్పుకొచ్చింది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.