English | Telugu
బుల్లితెర మాటల మాంత్రికుడికి నమస్కారం పెట్టేసిన త్రివిక్రమ్!
Updated : Feb 16, 2023
"సర్" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మూవీ టీమ్ మొత్తాన్ని మెస్మోరైజ్ చేసేలా మాట్లాడి ఆనందంలో ముంచెత్తాడు. తన ఆల్ టైం ఫేవరేట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పారు. ఒక యాక్టర్ కి ఉన్నంత క్రేజ్ ఒక డైరెక్టర్ గా ఉంది అంటే అది ఆయన నుంచి వచ్చే మాటల ప్రవాహం కారణంగానే. "మాటలకు మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట థాంక్యూ త్రివిక్రమ్" అని ఆది కూడా మాటలతో మాయ చేసేసాడు.
"ప్రాసకి ఆశ కలిగి అది చూడాలి అనుకునే మొదటి ఫేస్ త్రివిక్రమ్ గారు... కుటుంబంలోని వాల్యూస్ తాలూకా వాసనలు లేకుండా ఆయన మూవీస్ అస్సలు తియ్యరు. నాకు తెలిసి ఒక వైట్ పేపర్ కి న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ గారు మాత్రమే..బాగా వర్షం వచ్చే టైంలో బజ్జీలు తింటే ఆ కాంబినేషన్ ఎంత బాగుంటుందో..ప్రీరిలీజ్ ఈవెంట్లు, సుమగారు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో ...మెగాస్టార్ చిరంజీవి ఆయన డాన్స్ ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో.. క్రికెట్‌లో ధోనీ..లాస్ట్ బాల్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో.. త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది.
అందుకే వాళ్లిద్దరూ అంటే నాకు పిచ్చ ఇష్టం. మెడ మీద చెయ్యి పెట్టి ప్రతీ ఒక్కరూ ఒక పవన్ కళ్యాణ్ లా, పేపర్ మీద పెన్ పెట్టిన ప్రతీ ఒక్కరూ త్రివిక్రమ్ లా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్లంటే మనకు అంతా ఇష్టం. ఫైనల్ ఒక్కటి చెప్తాను..మీది భీమవరం..మీరు ఇండస్ట్రీకి రావడం మా అందరికీ వరం" అని చెప్పాడు ఆది.