English | Telugu
పాన్ ఇండియా మార్కెట్‌పై మరోసారి నాని కన్ను
Updated : Sep 8, 2023
సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను పక్కన పెడితే ఇప్పుడు మన సౌత్ స్టార్స్ అందరూ వరుస పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు. ఆ కోవలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు. ఆయన గత చిత్రం దసరాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ నానికి మాస్ హిట్ దక్కటమే కాకుండా ఆయన్ని వంద కోట్ల క్లబ్ హీరోగానూ మార్చింది. ఇప్పుడు ఆయన హాయ్ నాన్న సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకులను మెప్పించనుంది.
నాని తన నెక్ట్స్ మూవీని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అంటే సుందరానికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే కూడా వివేక్ ఆత్రేయపై నమ్మకంతో నాని మరో ఛాన్స్ ఇచ్చారు. ఈసారి వివేక్ ఆత్రేయ రొటీన్‌కు భిన్నంగా నానితో యాక్షన్ మూవీని చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తే బావుంటుందని నాని అండ్ టీమ్ భావిస్తుంది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ను సాధించిన నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిచనున్నారు.
హాయ్ నాన్న విషయానికి వస్తే దీనికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. చెరుకూరి మోహన్, తీగల విజేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇందులో మృణాల్ ఠాకూర్ నటించింది. శ్రుతీ హాసన్ కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్‌లో పెట్టటానికి నాని తన వంతు ప్రయత్నాలను చేస్తున్నారు.