English | Telugu
పెళ్లైన హీరోయిన్‌తో హీరో సూర్య సరసాలు!
Updated : Sep 8, 2023
డిఫరెంట్ రోల్స్, మూవీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన క్రేజ్ సంపాదించుకున్న వెర్సటైల్ హీరో సూర్య. ప్రతీ సినిమాలోనూ ఆయన ఏదో ఒక కొత్తదనాన్ని చూపించటానికి ఆరాటపడుతుంటారు. ఆ దిశగానే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తోన్న చిత్రం కంగువా. ఇదొక పీరియాడిక్ మూవీ. దీని తర్వాత ఈయన నటించబోయే సినిమాలు చాలానే లైన్‌లో ఉన్నాయి. అందులో ముందుగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుందని మీడియాలో వినిపిస్తోన్న టాక్. సూర్య 43గా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల మేరకు మేకర్స్ మలయాళీ ముద్దుగు నజ్రియా నజీమ్‌ను హీరోయిన్‌గా నటించాలని సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నజ్రియా చాలా పరిమితంగానే సినిమాల్లో నటిస్తుంది. నానితో అంటే సుందరానికీ సినిమాలో ఆమె కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నీ కుదిరితే సూర్య 43లోనూ అలరించనుంది. మరి పెళ్లైన మలయాళీ ముద్దుగుమ్మతో సూర్య రొమాన్స్ ఎలా ఉంటుందో మరి.
శూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రం సూర్య, సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కింది. డైరెక్టర్‌గా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబోలో మూవీ రానుంది. ఇది పూర్తి కాగానే సూర్య, వెట్రిమారన్ కాంబోలే వాడివాసల్ మూవీ తెరకెక్కనుంది. మరో వైపు టాలీవుడ్ డైరెక్టర్ చందు మొండేటి సైతం చతుర్వేదాలపై సినిమాను చేయటానికి సూర్యతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు , బాలీవుడ్‌కి చెందిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్ర రీసెంట్‌గా సూర్యను కలిసి కర్ణ అనే సబ్జెక్ట్‌ను వినిపించారని, మెయిన్ లైన్‌కు ఆయనకు బాగా నచ్చింది. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమన్నారనే న్యూస్ కూడా హల్ చల్ చేస్తోంది.