English | Telugu
ఆ రికార్డు మహేష్ వల్లే సాధ్యమైంది!
Updated : Sep 8, 2023
`
కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టిస్తే.. మరికొన్ని సినిమాలు వివిధ మాధ్యమాల్లో వ్యూస్‌ని బట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయి. అలాంటి ఓ కొత్త రికార్డును సూపర్‌స్టార్ మహేష్ క్రియేట్ చేశారు. 8 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ‘శ్రీమంతుడు’ ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నిర్మించిన ఈసినిమా అప్పట్లో థియేటర్లలో పెద్ద సంచలనమే సృష్టించింది.200+మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ నిలిచింది.
‘శ్రీమంతుడు’ ఫుల్ మూవీని యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్‌తోపాటు జనం మెచ్చిన సినిమాగా నిలిచింది. ఈ ఘనత సాధించిన నేపథ్యంలో దర్శకనిర్మాతలతోపాటు మహేష్ ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవడం అనే పాయింట్ మీద రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. మహేష్, శృతి హాసన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సుకన్య, సంపత్‌రాజ్, వెన్నెల కిశోర్, తులసి, సితార తదితరులు నటించిన ఈ సినిమాను కుటుంబ సమేతంగా అందరూ చూసి పెద్ద విజయాన్ని అందించారు. ఇప్పుడు యూ ట్యూబ్‌లోనూ తన సత్తా చాటుకుందీ బ్లాక్‌బస్టర్ మూవీ.