English | Telugu
బైక్ నడిపినందుకు ధనుష్ కొడుకు అరెస్ట్
Updated : Nov 18, 2023
తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. తన ఫేసుతో పాటు ధనుష్ అనే తన పేరుని పూర్తిగా మర్చిపోయి సినిమాలో తాను పోషించే క్యారక్టర్ లోప్రేక్షకుల్ని లీనమయ్యేలా చేయడం ధనుష్ నటనికి ఉన్న స్టైల్. కొన్ని లక్షల మంది అభిమాన సైన్యాన్ని సంపాదించుకున్న ధనుష్ కి తెలుగులో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఇప్పడు ధనుష్ కొడుకుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
ధనుష్ కొడుకు యాత్ర ఆర్ 15 బైక్ ని నడిపినందుకు పోలీసులు అరెస్ట్ చేసారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ బైక్ ని మైనర్లు నడపకూడదు. ఇంకా 18 సంవత్సరాలు కూడా నిండని యాత్ర ఆర్ 15 బైక్ నడపటంతో పోలీసులు కేసు నమోదు చేసారు. పోయిస్ గార్డెన్ ఏరియాలో యాత్ర బైక్ నడుపుతున్నప్పుడు ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ డ్రైవింగ్ విషయం బయటపడింది.పైగా పోయస్ గార్డెన్ లాంటి ప్రముఖులు ఉన్న ఏరియాలో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ధనుష్ ,రజనీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య లు విడాకులు తీసుకునే నాటికి వాళిద్దరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరిలో పెద్ద అతనే యాత్ర. రెండవ కొడుకు పేరు లింగ. ఇప్పుడు యాత్ర మీద పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో చట్టం దృష్టిలో అందరు సమానమే అనే సంకేతాలని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినట్టయ్యింది.