English | Telugu
తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన హీరో నాని
Updated : Nov 18, 2023
నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే రాజకీయ పార్టీ ని స్థాపించి పార్టీ పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన హాయ్ నాన్న పార్టీ కి సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టోని నాని విడుదల చేసాడు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా తమ పార్టీ ఎలెక్షన్ మేనిఫోస్టోని రిలీజ్ చేసినప్పుడు మీడియాతో మాట్లాడటం ఆనవాయితీ. నాని కూడా అదే ఆనవాయితీని కంటిన్యు చేస్తు మీడియా ముందు తమ పార్టీ మేనిఫోస్టోలో పొందుపరిచిన వాటి గురించి ప్రేక్షకులకి సుదీర్ఘంగా వివరించాడు.
హాయ్ నాన్న పార్టీ కనుక వచ్చే డిసెంబర్ 7 న జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే యూత్ అందరికి రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ల తో పాటు మంచి లైటింగ్ ని ఏర్పాటు చేస్తుంది. అలాగే థియేటర్ల ఆదాయాన్నిపెంచడంతో పాటుగా థియేటర్ దగ్గరే ఉండే షాపుల వాళ్ళ ఆదాయాన్ని కూడా పెంచుతారు. అలాగే ప్రతి జంక్షన్ లో నాని కటవుట్ అండ్ హాయ్ నాన్న సినిమా ఉండేలా చూస్తారు. అలాగే ఈ వరల్డ్ కప్ చూడటానికి ఎలాగు టికెట్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వరల్డ్ కప్ కి టికెట్స్ ని ఫ్రీగా ఇస్తారు.అలాగే మరి ముఖ్యంగా కూతురు ఉన్న ప్రతి తండ్రి కి అలాగే ఆ కూతురికి ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉండేలా చూస్తారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండని చిన్నపిల్లకి కూడా ఓటు హక్కు ని కలిపించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తారు. ఇవే కాకుండా చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించని విధంగా హాయ్ నాన్న పార్టీ ఎన్ఆర్ఐ లకి కూడా కొన్ని హామీ లని ప్రకటించింది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో హామీలని హాయ్ నాన్న రాజకీయ పార్టీ ప్రేక్షకుల కోసం ప్రకటించింది. పార్టీ అధినేత నాని చివరలో కొంచం ఎమోషనల్ కి కూడా గురయ్యాడు.