English | Telugu

క్యాన్సర్‌ను జయించింది.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది!

క్యాన్సర్‌కు ఎవ్వరూ అతీతులు కాదు. అది ఎవరినైనా కబళిస్తుంది. అయితే కొందరు దానిపై పోరాటం చేసి జయిస్తున్నారు, మరికొందదు దాని బారి నుంచి తప్పించుకోలేక మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. క్యాన్సర్‌ను జయించిన వారు సినిమా సెలబ్రిటీల్లో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఎంతో మంది ఉన్నారు. వారిలో నటీమణి హంసానందిని ఒకరు. రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన ఆమె.. దాన్నుంచి బయటపడేందుకు పెద్ద పోరాటమే చేసింది. అయితే చివరికి క్యాన్సర్‌ను జయించింది. ఈ వ్యాధి జన్యుపరంగా తన తల్లి నుంచి సంక్రమించింది. వ్యాధి సోకిన తర్వాత హంసానందిని ఎంతో మానసిక క్షోభకు గురయ్యారు. అయినా పట్టుదలతో దాన్ని జయించి ఎంతో మంది క్యాన్సర్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలిచారు. అప్పటి నుంచి క్యాన్సర్‌ బాధితుల్లో అవగాహన పెంచేందుకు ఏదో ఒక వీడియోతో సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నారు.

తాజాగా నేడు నేషనల్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా హంసానందిని మరో వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసారు. అందులో క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు తన తల్లి పేరు మీద ‘యామిని క్యాన్సర్‌ ఫౌండేషన్‌’ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా పౌండేషన్‌కి సంబంధించిన మెయిల్‌ ద్వారా తమ సమస్యని వివరించవచ్చునని పేర్కొన్నారు. రెగ్యులర్‌ సెల్ఫ్‌ చెకప్స్‌.. మామోగ్రఫీ.. జెనెటిక్‌ పరీక్షలు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చేయించుకొంటే క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చని చెబుతున్నారు. బ్రెస్ట్‌ కేన్సర్‌, దానికి సంబంధించిన చికిత్సల గురించిన సమాచారం దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నది తన లక్ష్యమని హంసానందిని చెబుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .