English | Telugu

ఒకరు కాదు ఇద్దరు గజినీలు 

ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యి సంచలన విజయం సాధించిన సినిమా గజిని. అదే సినిమా 2008 లో అమీర్ ఖాన్ హీరోగా హిందీలో కూడా రీమేక్ అయ్యి బాలీవుడ్ చిత్ర సీమలో 100 కోట్లు వసులు చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. తాజాగా ఇద్దరు గజినీలకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సూర్య, అమీర్ ఖాన్ ఇద్దరు కూడా చాలా మంచి నటులు. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తమకంటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటుచేసుకున్నారు. వీరిద్దరూ తాజాగా కమల్ హాసన్ పుట్టిన రోజు వేడుకల్లో కలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఆఇద్దర్ని తన సెల్ ఫోన్ లో బంధించి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరు గజినీ లు ఒకే ఫ్రేమ్ లో అంటూ ఓ బ్యూటిఫుల్ స్నాప్ ని తన సోషల్ మీడియా లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమీర్, సూర్య అభిమానులు అయితే ఆ ఫోటో చూసి ఆ ఇద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు.

మిలినియర్ అయిన ఒక బిసినెస్ మాన్ యాడ్స్ చేసుకునే ఒక సాధారణ అమ్మాయి ప్రేమలో పడతాడు . ఆ తర్వాత కొంత మంది విద్రోహుల చేతుల్లో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోతుంది. ఆ ప్రాసెస్ లోనే ఆ మిలినియర్ మతిమరుపు వాడిగా మారతాడు. మతి మరుపు ఉన్న వ్యక్తిగా బాధపడుతునే తను ప్రేమించిన అమ్మాయిని చంపిన వాళ్ళని తుదముట్టించే గజిని క్యారక్టర్ భారతీయ ప్రేక్షకులకి సూపర్ గా నచ్చింది. సూర్య, అమీర్ లు ఇద్దరు ఆ పాత్రకి ప్రాణం పోశారు. ఇక సూర్య కంగువ అనే సినిమాలో బిజీగా ఉండగా అమీర్ సితారే జమీన్ పర్ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.