English | Telugu

స్టార్ హీరోతో కమెడియన్ పృథ్వీ వియ్యం... డేటింగ్‌లో కూతురు!

కమెడియన్ పృథ్వీ ఒక సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్తుంటే ఆ అదేదో సినిమా డైలాగ్ చెప్తున్నాడులే అని అందరు అనుకున్నారు..కానీ తన సినిమా జర్నీ థర్టీ ఇయర్స్ గా కొనసాగుతూనే ఉంటుందని ముందుగానే తెలుగు ప్రేక్షకులకి హింట్ ఇస్తున్నాడనే విషయాన్ని ఎవరు గ్రహించలేకపోయారు. 30 సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో తన దైన స్టైల్లో కామెడీని పండించి ప్రేక్షకుల దృష్టిలో తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా పృథ్వీ కూతురుకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

పృథ్వీ కూతురు పేరు శ్రీలు. ఇప్పుడు ఈమె ఒక స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ లో ఉందని త్వరలోనే వాళ్లిదరు పెళ్లి చేసుకోబుతున్నారనే గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అది నిజమే అన్నట్టుగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ శ్రీలుతో ఆ విషయాన్నే ప్రస్తావిస్తు ఎవరు నీ లవర్ అని అడిగింది. అప్పుడు ఆమె సిగ్గుతో మురిసిపోయిందే కానీ ఆ వ్యాఖ్యలని తిప్పుకొట్టలేదు .దీంతో శ్రీలు ప్రేమించే ఆ నటుడి కొడుకు ఎవరు అనే ఆలోచన అందరిలో మొదలయ్యింది.

ఇక పోతే శ్రీలు ని చూసిన ఎవరయినా సరే హీరోయిన్ మెటీరియల్ కదా అని అనుకోవలసిందే. నేటి తెలుగు హీరోయిన్ల అందానికి ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంటుంది. కాకపోతే తనకి పెద్ద దర్శకురాలు అవ్వాలనేది కోరిక.అందులో భాగంగానే రంగుల ప్రపంచం అనే సినిమాతో దర్శకురాలిగా ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.