English | Telugu
మా గురించి ఏం రాసినా ఫర్వాలేదు.. నేను హ్యాపీగా ఉన్నాను!
Updated : Nov 25, 2023
ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయడం, ఆ తర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి వన్నీ ఎక్కువగా మనం సినిమా ఇండస్ట్రీలోనే చూస్తుంటాం. ఈ విషయాల ప్రస్తావన వచ్చినపుడు.. సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. మేం సెలబ్రిటీస్ కాబట్టి అందరూ మా వైపే చూస్తారు. మేం హైలైట్ అవుతాం అంటూ కొందరు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే సాధారణ ప్రజల్లో విడాకులు తీసుకొనే వారు మళ్లీ మళ్లీ పెళ్ళిళ్ళు చేసుకునే వారి శాతం ఎంత ఉంటుంది? అని ఆలోచిస్తే చాలా చాలా తక్కువనే చెప్పాలి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగానే జీవితాన్ని లీడ్ చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో కొందరు మరో తోడు కోసం ఎదురు చూస్తున్నవారు కూడా ఉన్నారు.
అక్కినేని నాగచైతన్యను ఉదాహరణగా తీసుకుంటే.. సమంతతో ప్రేమ, పెళ్ళి ఆ తర్వాత సహజంగానే విడాకులు జరిగిపోయాయి. విడాకుల తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నప్పటికీ నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళతో రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల శోభిత పేరును ప్రస్తావిస్తూ ‘ఇద్దరూ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు కదా’ అని చైతన్యను ప్రశ్నిస్తే దానికి ‘రాసేవాళ్ళను మనం ఆపలేము. ఎవరెన్ని రకాలుగా రాసుకుంటారో రాసుకోమని చెప్పండి. అలా రాయడం వల్ల ఏం జరుగుతుంది. నేను ఆ అమ్మాయితోనే ఉన్నాను అనుకోండి. నేను మాత్రం నా పర్సనల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ సమాధానమిచ్చాడు.