English | Telugu
"బాడీగార్డ్" ఫ్యామిలీ చిత్రం - గోపీచంద్
Updated : Jan 23, 2012
"బాడీగార్డ్" ఫ్యామిలీ చిత్రం అని మలినేని గోపీచంద్ అన్నారు. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం"బాడీగార్డ్". ఈ చిత్రం ఇటీవల సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా, ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించిన సలోని, ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ నిర్మాతల మండలిలో జనవరి 23 న విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ముందుగా సలోనీ మాట్లాడుతూ, "బాడీగార్డ్" చిత్రంలోని సెంటిమెంట్ సీన్లు చూసి భాషరాని వారు కూడా కన్నీరు పెడుతున్నారనీ, అంతగా హృదయానికి హత్తుకునేలా దర్శకులు ఈ చిత్రాన్ని తీశారనీ, హీరో విక్టరీ వెంకటేష్ గారితో నటించటం ఒక అదృష్టంగా భావిస్తున్నాననీ, త్రిష చాలా మంచి నటి, తనకు స్నేహితురాలనీ, ఈ "బాడీగార్డ్" చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలనీ అన్నారు.
దర్శకుడు మలినేని గోపీచంద్ ప్రసంగిస్తూ ఇది సకుటుంబంగా చూడతగ్గ ఫ్యామిలీ చిత్రమనీ, దర్శకులు వినాయక్ వంటి వారు తనను ఈ సినిమా బాగా తీశానని అభినందించారనీ అన్నారు.