English | Telugu
పెళ్ళికి ముందే బిగ్ బాస్ విన్నర్‌తో లావణ్య త్రిపాఠి!
Updated : Sep 8, 2023
ఈ ఏడాదో వచ్చే ఏడాదిలోనో హీరో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆమె సినిమాలతో పాటు ఓటీటీల వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ఓటీటీలో లావణ్య నటించటం కొత్తేమీ కాదు. ఇది వరకే జీ 5 నిర్మించిన పులి మేక వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా మెప్పించింది. దీనికి సీక్వెల్‌ను కూడా వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా మరో వెబ్ సిరీస్‌లోనూ ఆమె నటించటానికి రెడీ అయ్యిందని సినీ సర్కిల్స్‌లో వినిపిసోన్న సమాచారం. వార్తల మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లావణ్యతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయి.
మీడియా వర్గాల్లో వస్తోన్న టాక్ మేరకు ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య జతగా బిగ్ బాస్ విన్నర్ కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్‌లో ఆరు సీజన్స్ ముగిశాయి. అన్నింట జెంట్స్ విన్నర్స్‌గా నిలిచారు. మరి వీరిలో లావణ్యతో కలిసి నటించేదెవరా? అనే అనుకోవచ్చు.. అదెవరంటే అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో హీరోగా కనిపించిన అభిజీత్‌కు తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు లేవు. సాధారణంగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రధానంగానే వెబ్ సిరీస్‌లను మన మేకర్స్ రూపొందిస్తున్నారు. అయితే అభిజీత్, లావణ్య త్రిపాఠి కలిసి నటించబోతున్న ఈ సిరీస్ రొమాంటిక్ కామెడీ అని సమాచారం. కాగా ఈ సిరీస్ షూటింగ్‌ను పెళ్ళికి ముందే ముగించేయాలనే ప్లాన్‌లో వుందట లావణ్య.
స్కైలాబ్ అనే తెలుగు సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విశ్వఖండే రావు ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే డిస్నీ యాజమాన్యం ప్రకటనను వెలువరిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అభిజీత్ విషయానికి వస్తే.. సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినప్పటికీ తను బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేశారు. అందులో విజేతగానూ నిలిచారు.