English | Telugu
నిన్న 'జైలర్'.. నేడు 'జవాన్'.. రేపు 'లియో'.. !
Updated : Sep 8, 2023
నిన్నటి వరకు ఎక్కడ చూసినా 'జైలర్' కలెక్షన్ల మోతే వినిపించింది. కట్ చేస్తే.. ప్రస్తుతం 'జవాన్' వసూళ్ళ ముచ్చట సాగుతోంది. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది ఏందయ్యా అంటే.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.
తమిళనాట స్టార్ కంపోజర్ గా దూసుకుపోతున్న అనిరుధ్.. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఒక్క సినిమాతో కూడా పలకరించనేలేదు. అయితే, ద్వితీయార్ధంలో మాత్రం వరుస విజయాలతో దుమ్ము రేపుతున్నాడు. గత నెల 10న తమిళ చిత్రం 'జైలర్'తో సత్తా చాటిన ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్.. ఇప్పుడు బాలీవుడ్ వెంచర్ 'జవాన్'తో మరో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. వచ్చే నెల 19న హ్యాట్రిక్ పై కన్నేశాడు. దళపతి విజయ్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న 'లియో' సినిమాకి కూడా అనిరుధ్ నే స్వరకర్త. మరి.. జైలర్, జవాన్ బాటలో లియో కూడా పయనించి.. అనిరుధ్ కి 2023లో హ్యాట్రిక్ అందిస్తుందేమో చూడాలి. అలాగే, మూడు వరుస నెలల్లో వరుస హిట్స్ తో రేర్ హ్యాట్రిక్ క్రెడిట్ అవుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.