English | Telugu
భోళా జీ యే క్యా జీ.. హిందీలో 'భోళా శంకర్'.. చిరుకి డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలుసా?
Updated : Aug 14, 2023
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' మాత్రం ఇంట గెలవలేకపోయినా రచ్చ గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25 న హిందీలో విడుదల కానుంది.
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా 'భోళా శంకర్'. తమిళ్ మూవీ 'వేదాళం'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11 న విడుదలైంది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకొని పేలవ వసూళ్లతో డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. అయితే త్వరలో ఈ సినిమా హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆగస్టు 25 న హిందీ ప్రేక్షకులను పలకరించనున్న ఈ మూవీ హిందీ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ జాకీ ష్రాఫ్ హిందీలో చిరంజీవి పాత్రకి డబ్బింగ్ చెప్పడం విశేషం. మరి ఈ సినిమా హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.