English | Telugu

నాకే అవకాశం ఉంటే నేను నా బిడ్డను కడుపులో మోస్తాను

కొన్ని వార్తల్ని గనక చూసుకుంటే మగవాళ్ళు బిడ్డల్ని కన్నారనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఆధారంగా "మిస్టర్ ప్రెగ్నెంట్" మూవీ త్వరలో రాబోతోంది. ఇందులో హీరోగా బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, హీరోయిన్ గా రూప కొడువాయుర్ నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోహైల్ తన రోల్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.

"ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్ మగవాళ్లకు వస్తే చాలా కష్టం కదా" అన్న ప్రశ్నకు "కష్టమనే విషయాన్ని పక్కన పెడితే..సైంటిఫిక్ గా మగవాళ్ళు బేబీని క్యారీ చేసే ఆప్షన్ ఉంటే గనక నేను కచ్చితంగా పెళ్లయ్యాక బేబీని నా కడుపులో మోస్తా.. నేను దాన్ని ఫీలవుతాను. నేను ఎప్పుడూ సంథింగ్ డిఫరెంట్ మూవీస్ చేయాలనీ అలాంటి వాటినే ఎంచుకుంటున్నాను. బిగ్ బాస్ లో చెప్పినట్టు కథ వేరేనే ఉంటుంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను..మిస్టర్ ప్రెగ్నెంట్ చేస్తాను అని నా ఫ్రెండ్స్ తిట్టారు. కానీ నేను మాత్రం ఆ మూవీ చేస్తానని అలాగే చేసి చూపించాను. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో ఏదైతే నేను కడుపును మోసానో అది మూడు కేజీల బరువు ఉంటుంది. ఈ బరువును నడుముకు కట్టుకుని రెండు గంటలు కూడా నేను మోయలేకపోయాను. కానీ ఒక తల్లి అంత బరువును 9 నెలలు ఎలా మోస్తున్నారా అనిపించింది. నాకు ఈ రోల్ ద్వారా ఒక ప్రెగ్నెంట్ లేడీ బిడ్డను మోసేటప్పుడు వాళ్లకు వుండే వేవిళ్లు, వామిటింగ్ సెన్సేషన్స్ గురించి, మూడ్ స్వింగ్స్ గురించి వాళ్ళు భయపడే తీరు, బేబీ మీద ఉన్న ఫీలింగ్స్, గంటకోసారి యూరిన్ కి వెళ్లడం ఇలాంటి మదర్ హుడ్ విషయాలను ఈ మూవీ ద్వారా తెలుసుకున్నాను ..ఇంత బరువు ఎందుకు అని నేను కూడా డైరెక్టర్ ని అడిగాను కానీ నువ్వు ఆ బరువును మొస్తేనే ఆ ఫీలింగ్స్ అనేవి వస్తాయని చెప్పారు. కొన్ని మూవీస్ లో తాగుబోతు క్యారెక్టర్స్ వేయాలంటే ఉదయాన్నే మందు తాగిస్తారు.. అప్పుడు ఆ షాట్ పక్కాగా వస్తుంది. అలాగే నన్ను కూడా అంత బరువు మోయించి పక్కాగా చేశారు " అని చెప్పాడు సోహైల్ అలియాస్ మిస్టర్ ప్రెగ్నెంట్.