English | Telugu
కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ నటుడు..
Updated : Oct 26, 2023
సినీ పరిశ్రమలోకి ఎవరైనా యుక్తవయసులోనే ప్రవేశించి 24 క్రాఫ్ట్స్ లో తమకి నచ్చిన వృత్తిని ఎంచుకొని సినిమా పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ ఎలక్ట్రిక్ బోర్డు లో పని చేసి పదవి విరమణ చేసిన తర్వాత సినిమా మీద ఇష్టంతో ఒక వ్యక్తి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తే మురళి గౌడ్. సినీ కళామతల్లికి దొరికిన ఒక మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా మీద సినిమా చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ఆయన తాజాగా కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టిస్తుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ మురళి గౌడ్ తెలుసా అని ఎవర్నైనా అడిగితే వెంటనే చెప్పలేరేమో గాని బలగం మూవీ నారాయణ తెలుసా అంటే అందరు తెలుసు అని చెప్తారు. బలగం సినిమాలో మురళి గౌడ్ నారాయణ క్యారక్టర్ లో అంతలా నటించాడు. ఆ సినిమా లో నటించిన అందరి కంటే నారాయణకి కొంచం ఎక్కువగానే పేరొచ్చింది. సగటు కుటుంబాల్లో ఇంటి అల్లుడు ఎలా ఉంటాడో అతని మెంటాలిటీ ఎలా ఉంటుందో అచ్చు అలాగే నటించి అందరి చేత నీరాజనాలు అందుకున్నాడు. అలాగే ఇటీవలే భగవంత్ కేసరి మూవీ లో కూడా అధ్భుతంగా నటించి శబాష్ అని అనిపించుకున్నాడు.
ఇక అసలు విషయంలోకి వస్తే మురళిని గౌడ్ తాజగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నేను ఉద్యోగం లో రిటైర్ అయ్యాక సినిమా మీద ఇష్టం తో సినిమా ల్లో అవకాశాల కోసం ప్రయత్నించానని కానీ ఈ వయసులో ఎవరు అవకాశాలు ఇస్తారని అనుకోలేదు. కాని చాలా మంచి క్యారక్టర్ లని దర్శకులు ఇస్తున్నారని రీసెంట్ గా చేసిన భగవంత్ కేసరి సినిమా లో ని క్యారెక్టర్ కి కూడా చాలా మంచి పేరు వచ్చిందని ఆనందం తో మురళి గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మెదక్ దగ్గరలోని రామయంపేట మురళి గౌడ్ స్వస్థలం.