English | Telugu
అప్పుడే ఓటీటీలోకి లియో!
Updated : Oct 26, 2023
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'లియో'. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 'ఖైదీ', 'విక్రమ్' తర్వాత మూడో సినిమాగా తెరకెక్కిన లియో.. అక్టోబర్ 19న విడుదలైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్ తేలిపోయిందని.. లోకేష్ గత చిత్రాల స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించిన న్యూస్ వినిపిస్తోంది.
'లియో' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందట. నవంబర్ 20 లేదా 21 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారట. తమిళ్, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఒకేసారి ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని సమాచారం.