English | Telugu

బాహుబలి రికార్డ్: ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్!!

రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది. ఇప్పటికే ఇండియాలో 175కోట్ల షేర్ ను వసూళ్ళు చేసిన బాహుబలి, అమీర్ ఖాన్ 'పీకే' సినిమా సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. అయితే అమీర్ 'పీకే' ఓకే బాషలో కలెక్షన్లు సాధించగా, బాహుబలి మాత్రం పలు బాషల్లో కలెక్షన్లు రాబట్టి, కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

రెండో వారంలో కూడా 'బాహుబలి'  కలెక్షన్ల జైత్రయాత్ర కొనసాగుతూ వుండడంతో, ఈ సినిమా ఇండియాలోనె మొదటి 200 కోట్ల షేర్ సాధించిన సినిమాగా నిలవబోతుంది. అయితే గ్రాస్ కలేక్షన్ల పరంగా చూస్తే ఇండియాలో 'పీకే'నె మొదటి స్థానంలో వుంటుంది.

అయితే  'బాహుబలి' ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని రాజమౌళి కూడా ఊహించి వుండరు.  అంచనాలు మించి బాహుబలి ఇండియాలో కలెక్షన్ల కురిపిస్తోంది. ఈ దెబ్బతో రాజమౌళిపై మరింత ప్రెజర్ పెరగనుంది. బాహుబలి 2 కోసం ఇండియా మొత్తం భారీ అంచనాలతో ఎదురుచూడబోతుంది.