English | Telugu
భజరంగ్ బన్నీ..
Updated : Jul 22, 2015
బాలీవుడ్‌లో భజరంగ్ భాయ్‌జాన్ విజృంభిస్తోంది. చాలా సున్నితమైన కథని కబీర్‌ఖార్ అద్భుతంగా డీల్ చేశాడని, సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అని ప్రసంశలు అందుతున్నాయ్. ఈ సినిమా వందల కోట్లు దాటి... సంచలన విజయం దిశగా సాగిపోతోంది. అయితే ఈ కథని విజయేంద్రప్రసాద్ చాలామంది హీరోలకు వినిపించారు. అందులో బన్నీ కూడా ఉన్నాడు. బన్నీకి సాఫ్ట్ కథలంటే ఇష్టమే. వేదంతో ఓ ప్రయోగం కూడా చేశాడు.
కానీ భజరంగ్ భాయ్‌జాన్ కథ విషయానికొచ్చినప్పుడు కాస్త కంగారుపడ్డాడట. ఇండియా - పాకిస్థాన్ కథగానే ఈ సినిమాని తీర్చిదిద్దితే జనం ఆదరిస్తారని.. అలా చేయాలంటే ఈ సినిమాని ఓ పెద్ద స్థాయిలో చేయాలని, బాలీవుడ్ సినిమాకే ఆ స్కోప్ ఉందని బన్నీ చెప్పాడట. దాంతో చివరికి అటు తిరిగి ఇటు తిరిగి సల్మాన్ ఖాన్ దగ్గరకు వెళ్లడం అది భజరంగ్ భాయిజాన్ గా రూపుదిద్దుకోవడం జరిగిపోయాయి. నిజంగానే కథకు టెమ్ట్ అయ్యింటే ఈసినిమా ఫలితం ఏ రేంజులో ఉండేదో.?