English | Telugu
రాజమౌళి, మహేష్ మూవీ..నాగ్, బాలయ్యకు షాక్
Updated : Jul 22, 2015
బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఆశలకు గండికొట్టాడు మహేష్ బాబు. అది ఎలా అంటారా? రాజమౌళి నెక్స్ట్ మూవీ తనతో దాదాపు ఖాయమని ప్రకటించాడు మహేష్. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కథ చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే బహుబలితో 2016 ఎండింగ్ వరకు రాజమౌళి డైరీ ఖాళీగా లేదు. ఆ తరువాత మహేష్ తో సినిమా అంటే మరో సంవత్సరం బిజీ అయిపోతాడు. అంటే 2018 వరకు రాజమౌళి ఎవరికి దొరకడు.
బాహుబలి తరువాత రాజమౌళితో అఖిల్ సినిమా చేయించాలని అనుకున్నాడు నాగార్జున, అలాగే కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ రాజమౌళి అయితే బెటరని బాలయ్య భావించాడట. ఇక ఎన్టీఆర్ జక్కన్న స్నేహం తెలిసిందే. రవితేజ కూడా రాజమౌళితో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు వీరి ఆశలన్నిటికి గండికొట్టారు మహేష్ రాజమౌళి. మళ్ళీ మూడేళ్ల తరువాత ఈక్వేషన్లు ఎలా వుంటాయో, రాజమౌళి బాలీవుడ్ కి వెళ్ళకుండా ఇక్కడే వుంటారా?